
ఆంధ్రప్రదేశ్
పాఠశాలకు సరఫరా చేసిన కోడిగుడ్లు
తాళ్లరేవు, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడంతో మధ్యాహ్న భోజనం తయారు చేసే నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం 427 గుడ్లు సరఫరా చేశారు. అందులో 68 గుడ్లు పాడైనట్లు గుర్తించి, మిగతా వాటిని ఉడకబెట్టారు. అందులోనూ చాలా వరకు కుళ్లినట్లు పెంకు తీసే క్రమంలో గుర్తించారు. సోమవారం సరఫరా చేసిన వాటిలో ఏకంగా 510 గుడ్లు పాడైపోయినట్లు పాఠశాలలో వంట చేసే మహిళలు తెలిపారు. దీంతో సగం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా ఇంటికి వెళ్తున్నారన్నారు. మంగళవారం 771 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరైతే 427 మందే భోజనం చేశారని వివరించారు.
గుడ్డు లోపల కుళ్లిపోయి ఇలా..