
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్ అనంతరం తలెత్తిన సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆరోగ్యం మెరుగుపడినట్లు మంగళవారం రాత్రి ఏఐజీ ఆస్పత్రి ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన క్రమంగా కోలుకుంటున్నట్లు వెల్లడించింది. శ్వాస తీసుకోవడంలోని ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలన్నీ సాధారణ స్థితికి వచ్చాయని పేర్కొంది. డాక్టర్.డి.నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్ ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షిస్తున్నామని, డిశ్చార్జిపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.