
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, దిల్లీ: పార్లమెంటులోని కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైకాపా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి మంగళవారం కలిశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని, రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అపార నష్టం వాటిల్లిందని, సహాయం చేయాలని వినతిపత్రం అందించారు