
ఆంధ్రప్రదేశ్
లేఖలో పేర్కొన్న సోనియా గాంధీ
ఈనాడు, అమరావతి: కాంగ్రెస్ సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ కొనియాడారు. రోశయ్య మరణంపై విచారం వ్యక్తం చేస్తూ... ఆయన సతీమణి శివలక్ష్మి రోశయ్యకు మంగళవారం లేఖ రాశారు. ‘రోశయ్య మృతిపై ఎంతో బాధపడ్డాను. సుదీర్ఘమైన, విశిష్టమైన రాజకీయ నేపథ్యం కలిగిన అత్యంత సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు. ఆర్థిక అంశాలపై పట్టు, అవగాహన కలిగిన వ్యక్తి. మంచి నిర్వాహకులు కూడా.. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.