Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share Comments Telegram Share
నలుగురు మహిళలను మార్కెట్లో వివస్త్రలను చేసి, దాడి!

దుకాణంలో చోరీకి వచ్చారన్న అనుమానంతోనే...
పాకిస్థాన్‌లో ఘటన

లాహోర్‌: దుకాణంలో చోరీకి పాల్పడేందుకు వచ్చారన్న అనుమానంతో ఓ యువతి సహా నలుగురు మహిళలను వివస్త్రలను చేసి, వీధిలో ఊరేగించి, తీవ్రంగా కొట్టారు! తమను విడిచిపెట్టాలని, దుస్తులు ఇవ్వాలని బాధితులు ఎంతగా ప్రాధేయపడినా ఎవరూ వినిపించుకోలేదు. పైగా వారిని కర్రలతో తీవ్రంగా చితకబాదారు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలను కుదిపేసింది. కాగా, ఘటనకు సంబంధించి అయిదుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

దుస్తులు విప్పుతుండగా వీడియోలు...

వ్యర్థాలను ఏరుకోవడానికని బాధితులు సోమవారం ఫైసలాబాద్‌లోని బావా చాక్‌ మార్కెట్‌కు వెళ్లారు. దాహం వేయడంతో ఉస్మాన్‌ ఎలక్ట్రిక్‌ స్టోర్‌లోనికి వెళ్లి మంచి నీళ్లు అడిగారు. అయితే, దొంగతనం చేయడానికే వారు వచ్చారంటూ దుకాణ యజమాని సద్దాం, మరికొందరు వారిపై దాడికి పాల్పడ్డారు. రపరపా వారిని వీధిలోకి లాక్కొచ్చి, బట్టలు ఊడదీసి, సుమారు గంటపాటు అలాగే తిప్పారు. వస్త్రాలు తొలగిస్తున్నప్పుడు చాలామంది గుమిగూడి వీడియోలు తీశారే తప్ప, ఎవరూ ఆ దుశ్చర్యను అడ్డుకోలేదు! తమను విడిచిపెట్టాలని బాధితులు విలపించినా, ఒళ్లు దాచుకునేందుకు చిన్న గుడ్డముక్క ఇవ్వాలని పదేపదే ప్రాధేయపడినా ఎవరూ కనికరించలేదు. ఇది దురదృష్టకర ఘటన అని, దాడికి పాల్పడినవారిని విడిచిపెట్టబోమని ఫైసలాబాద్‌ పోలీసు ఉన్నతాధికారి డా.అబిద్‌ ఖాన్‌ మంగళవారం పేర్కొన్నారు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.