
జాతీయ- అంతర్జాతీయ
అక్రమ విక్రయాల గుట్టురట్టు
అక్రమ పెట్రోల్ విక్రయ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో బెల్తరోడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాప్రీ గ్రామంలో నివసిస్తున్న మీనా ద్వివేది ఇంటి నుంచి 12 వేల లీటర్ల పెట్రోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విదర్భ పెట్రోల్ డిపో నుంచి బయలుదేరిన ట్యాంకర్ల నుంచి మీనా పెట్రోల్‌ను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతోపాటు ఆమె ట్యాంకర్ డ్రైవర్ల నుంచి 22 లీటర్ల పెట్రోల్ క్యాన్‌ను రూ.1200 నుంచి రూ.1500కు కొంటూ అనంతరం దానిని రూ.1800కు విక్రయిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ట్యాంకర్ల నుంచి చోరీ జరగకుండా పెట్రోలియం కంపెనీలు అమర్చే రెండంచెల భద్రతా వ్యవస్థను అక్రమార్కులు చాకచక్యంగా తెరవగలుగుతున్నారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోపాల్ బిరాదార్ తెలిపారు.