
జాతీయ- అంతర్జాతీయ
ఈ నెల 31 వరకు సమర్పించొచ్చు: జితేంద్రసింగ్
దిల్లీ: కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రం(లైఫ్ సర్టిఫికెట్) సమర్పించే గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా) జితేంద్రసింగ్ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 పరిస్థితిని, వైరస్ కారణంగా వృద్ధులకు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పింఛను జారీలో ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా ఉండేందుకు ఇప్పటివరకు పింఛనుదారులు నవంబరు 30వ తేదీలోగా జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉండేది.