జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share Comments Telegram Share
గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణి పరీక్ష విజయవంతం

బాలేశ్వర్‌: నిట్టనిలువుగా గాల్లోకి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి (వీఎల్‌-ఎస్‌ఆర్‌ శామ్‌)ని భారత్‌ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ అస్త్రాన్ని ఒడిశా తీరానికి చేరువలోని చాందీపుర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక నుంచి ప్రయోగించింది. భారత నౌకాదళంలోని ప్రధాన యుద్ధనౌకల్లో దీన్ని మోహరించనున్నారు. వీఎల్‌-ఎస్‌ఆర్‌ శామ్‌లోని అనుసంధానిత వ్యవస్థలన్నింటినీ పరీక్షించేందుకు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. తక్కువ ఎత్తులో ఎగురుతున్న ఒక ‘ఎలక్ట్రానిక్‌ లక్ష్యం’పైకి ఈ క్షిపణిని ప్రయోగించారు. వెర్టికల్‌ లాంచర్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ అస్త్రంలోని ఉప వ్యవస్థలన్నీ చక్కగా పనిచేశాయి. ఈ ప్రయోగాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), నౌకాదళ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌.. 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, డీఆర్‌డీవో అధిపతి జి.సతీశ్‌ రెడ్డి తదితరులు  అభినందించారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.