
గ్రేటర్ హైదరాబాద్
నారాయణగూడ, న్యూస్టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 12 మంది ప్రముఖులను ప్రతిష్ఠాత్మక ‘ప్రతిభా పురస్కారాల’తో సత్కరిస్తోంది. 2018 సంవత్సరానికి మంగళవారం ఈ అవార్డులు ప్రకటించింది. ‘రామకవచం వెంకటేశ్వర్లు(కవిత), ఆచార్య వెలుదండ నిత్యానందరావు(విమర్శ), డి.అనంతయ్య(చిత్రలేఖనం), ఆర్.గంగాధర్(శిల్పం), ఓలేటి రంగమణి(నృత్యం), డా.ఎస్.కె.వెంకటాచార్యులు(సంగీతం), కల్లూరి భాస్కరం(పత్రికారంగం), రావుల వెంకట్రాజంగౌడ్(నాటకం), కౌళ్ల తలారి బాలయ్య(జానపద కళారంగం), డా.మలుగ అంజయ్య(అవధానం), ఎన్.అరుణ(ఉత్తమ రచయిత్రి), పి.చంద్రశేఖర్ ఆజాద్(నవల) పురస్కారాలకు ఎంపికయ్యారని వర్సిటీ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు.