
తెలంగాణ
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే: వ్యాపారులు ఇష్టారాజ్యంగా మిరప ధరలు తగ్గించారని ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు మంగళవారం ఆగ్రహించారు. మార్కెట్ గేట్లకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. దీంతో కొనుగోళ్లు నిలచిపోయాయి. సోమవారం ఏసీ మిరప క్వింటాకు రూ.19 వేలు పాడారు. ఆ రోజు 108 నమూనాలు వచ్చాయి. ధర బాగుందని రైతులు శీతలగిడ్డంగుల్లో నిల్వ చేసిన 800 నమూనాలను మంగళవారం మార్కెట్కు తీసుకొచ్చారు. ధర రూ.16 వేలకు పాడటంతో రైతులు మండిపడ్డారు. ఒక్కరోజులోనే రూ.3 వేలు తగ్గిస్తారా అని ప్రశ్నించారు.