
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఆన్లైన్ ఆడిట్‌కు కార్యాచరణ చేపట్టాలని ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాల్లో దీన్ని ప్రారంభించాలని సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రతి పైసా ప్రజలకు చేరాలని స్పష్టంచేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆడిట్ సహా ఇతర ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం మంత్రి సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లాలో ఈ మూడు నెలల్లో 2400 ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించడం ద్వారా రూ.1.26 కోట్లు ఖజానాకు చేరిందని తెలిపారు. ఇదేవిధంగా అన్ని జిల్లాల్లో ఆడిట్ సమావేశాలను ఏర్పాటు చేసి అభ్యంతరాలను అయిదారు నెలల్లో పూర్తిగా పరిష్కరించాలన్నారు. ఆ శాఖ జాయింట్ డైరెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రైతు రుణమాఫీ జరిగ్గా జరిగిందా? లేదా? అనేది పరిశీలన చేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిటింగ్ వందశాతం చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర ఆడిట్‌శాఖను మంత్రి అభినందించారు.