
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, అమరావతి: సోమవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి పేర్ని నాని ఉద్యోగుల సమ్మె నోటీసు అంశంపై విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ..‘సమ్మె నోటీసు ఇచ్చినా.. జీవితాంతం సమ్మెలో ఉండరు కదా? ఏదో ఒక రోజు ప్రభుత్వంతో చర్చకు రావాల్సిందే కదా? అందువల్లే వారికున్న అంశాలేవో వచ్చి ప్రభుత్వంతో మాట్లాడమని కోరుతున్నాం. నోటీసుపై మాకు అభ్యంతరం లేదు. ఇప్పటికీ వారిని ఆహ్వానిస్తున్నాం. నోటీసుతో మీరు ఒక అడుగు ముందుకు వేసినా ఎప్పటికీ మీరు మా పిల్లలే, ప్రభుత్వం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మనస్ఫూర్తిగా చర్చకు ఆహ్వానిస్తున్నాం. అంతేతప్ప చర్చలకు రాకుండా ఎక్కడో మీడియాలో మేం మాట్లాడినదాన్నే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలనడం ఎంతవరకు ధర్మం?’ అని ప్రశ్నించారు.
మరిన్ని
AP News: జీవితాంతం సమ్మెలో ఉండరు కదా.. చర్చకు రావాల్సిందే: మంత్రి పేర్ని నాని
సిద్ధూకు మంత్రి పదవి కోసం పాక్ ప్రధాని లాబీయింగ్: అమరీందర్
ఆంధ్రప్రదేశ్ నుంచి 31.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
విద్వేషాలను రెచ్చగొట్టే నిందితుడిని కేంద్రమంత్రి పరామర్శించడమేంటి?
Chandrababu: గుడివాడ క్యాసినోపై జాతీయ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు