
జాతీయ- అంతర్జాతీయ
ఉడుపి, న్యూస్‌టుడే: సంకల్పం ఉండాలేగాని వయసు అడ్డురాదని నిరూపించారు కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లా కిదియూరుకు చెందిన 66 ఏళ్ల గంగాధర కడేకర్. చేతులు, కాళ్లకు గొలుసులు బిగించుకుని అరేబియా సముద్రంలో మూడున్నర కిలోమీటర్ల దూరాన్ని ఈది ఔరా! అనిపించారు. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. సోమవారం ఆయన కిదియూరు వద్ద అరేబియా సముద్రంలో ఉదయం 7.50 గంటలకు ఈదడాన్ని ఆరంభించారు. ఏకధాటిగా 5.35 గంటలపాటు ఈది మూడున్నర కిలోమీటర్ల దూరం చేరుకున్నారు.