
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై పోరాటానికి అన్ని సంఘాలు కలిసి రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఐకాసగా ఏర్పాటయ్యాయి. సోమవారమిక్కడ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, రమేష్, మహేష్, విజయ్‌కుమార్, ఖాసీం, కిరణ్‌కుమార్, రాజేశ్వర్‌రావు, శ్రీకాంత్‌గౌడ్ కలిసి పలు అంశాలపై చర్చించారు. రోజువారీ శానిటేషన్ రిపోర్టు పాత విధానంలో కొనసాగించాలని, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఐకాస శాశ్వత సభ్యులుగా వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.