
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే 55 ప్యాసింజర్ రైళ్ల్లను రెండోసారి రద్దు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈనెల 21 నుంచి 24 వరకు నాలుగురోజుల పాటు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీటిని జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్లోని 38 ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దునూ కొనసాగించింది.