
గ్రేటర్ హైదరాబాద్
ఆచార్య సత్యేంద్ర దాస్
అయోధ్య (యూపీ): ఈసారి ఎన్నికల్లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీ చేయకపోవడం మంచి నిర్ణయమని, లేని పక్షంలో ఆయన తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి వచ్చేదని అయోధ్య తాత్కాలిక రామాలయం ప్రధాన పురోహితుడు ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. ‘‘శ్రీరాముడిని అడిగిన తర్వాతే నేను యోగికి ఈ సలహా ఇచ్చాను’’ అని చెప్పారు.