
గ్రేటర్ హైదరాబాద్
చండీగఢ్: పంజాబ్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో తెలుసుకునేందుకు ఆప్ చేసిన సర్వే ఓ స్కామ్ అని పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ విమర్శించారు. 4 రోజుల్లో 22 లక్షల కాల్స్ అందుకోవడం అసాధ్యమని చెప్పారు. ప్రజల్ని మోసగించే ప్రయత్నం మానుకుని, సర్వే నిజమైతే కాల్ రికార్డును సమర్పించాలని సోమవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఆప్ సర్వేపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నైరాశ్యంతోనే సిద్ధూ తమపై అభాండాలు వేస్తున్నారని ఆప్ ఖండించింది.