
గ్రేటర్ హైదరాబాద్
మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి
మేడారం(తాడ్వాయి), న్యూస్టుడే: సమ్మక్క, సారలమ్మ మహాజాతరలో కొవిడ్ నిబంధనలకు ప్రాధాన్యమిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సీతక్క, అధికారులతో కలిసి సోమవారం ఆమె ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పర్యటించారు. వనదేవతలకు పూజలు నిర్వహించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాగునీరు, మరుగుదొడ్లు, రహదారుల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భక్తుల రద్దీ ఉండే ప్రాంతాలను నిత్యం శానిటైజ్ చేస్తామన్నారు. ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తామని చెప్పారు. కొవిడ్ బారిన పడిన భక్తులు, అధికారులు ఉండేందుకు ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం స్థానిక గిరిజన, ఇతర వసతిగృహాలను వినియోగించుకుంటామని తెలపారు.