
గ్రేటర్ హైదరాబాద్
తిరుమల ఘాట్రోడ్డులో బస్సు ఢీకొని జింక మృతి
తిరుమల, న్యూస్టుడే: తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ జింక చనిపోతూ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం మొదటి ఘాట్రోడ్డులో వెళ్తున్న తితిదే పరకామణి బస్సు ముందు అకస్మాత్తుగా ఒక జింక దూకింది. డ్రైవర్ బ్రేకులు వేసేందుకు ప్రయత్నించగా అప్పటికే టైర్ కిందపడి మృతి చెందింది. ఆ జింక గర్భందాల్చి ఉండటంతో పిల్ల కడుపులో నుంచి బయటపడింది. తితిదే అటవీశాఖ అధికారులు జింక పిల్లను ఎస్వీ జూకు అప్పగించారు.