
క్రీడలు
ఇండియన్ గ్రాండ్‌ప్రిలో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్
ఈనాడు, హైదరాబాద్: ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఒడిషాలోని భువనేశ్వర్‌లో జరుగుతున్న ఇండియన్ గ్రాండ్ ప్రి సిరీస్ అథ్లెటిక్స్ టోర్నమెంట్లో అనూష ట్రిపుల్ జంప్ స్వర్ణం సాధించింది. ఆమె ఈ పోటీలో 12.9 మీటర్లు దూకి అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు చెందిన పూర్వ (12.6 మీ), శర్వారి (12.26 మీ) తర్వాతి రెండు స్థానాలు సాధించారు. అనూష విజయవాడలో కోచ్ కృష్ణమోహన్ వద్ద శిక్షణ పొందుతోంది.