
సినిమా
ఇంటర్నెట్ డెస్క్: వరుణ్‌ధావన్, కియారా అడ్వాణీ జంటగా నటించిన చిత్రం ‘జగ్ జగ్ జీయో’. ప్రముఖ నటులు అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రలు పోషించారు. రాజ్ మెహతా దర్శకుడు. ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. హాస్య సన్నివేశాలతోపాటు వేడుక నేపథ్యంలో వచ్చే ఓ సాంగ్‌తో రూపొందిన ఈ ట్రైలర్ ఆద్యంతం అలరించింది. ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీతో రూపొందినట్టు ప్రచార చిత్రాన్ని చూస్తే అర్థమవుతోంది. ఈ వీడియోలో కనిపించిన ప్రతి పాత్రా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంది. నాయకానాయికల పెళ్లి, విడాకుల ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు.