బిజినెస్‌

Facebook Share Twitter Share Comments Telegram Share
నెలనెలా ఆదాయం కోసం

* నేను ప్రైవేటు ఉద్యోగిని. వయసు 53 ఏళ్లు. మరో అయిదేళ్లపాటు ఉద్యోగంలో ఉంటాను. ఆ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలన్నది నా ఆలోచన. ఇప్పటి నుంచి నెలకు రూ.50 వేల వరకూ మదుపు చేయగలను. నా పదవీ విరమణ ప్రణాళిక ఎలా ఉండాలి? ఇప్పుడు జీవిత బీమా పాలసీ తీసుకోవచ్చా? - నారాయణచారి

మీరు ఇప్పుడు జీవిత బీమా పాలసీ తీసుకునేందుకు వీలవుతుంది. మీ వార్షికాదాయానికి 10 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను 12 ఏళ్ల వ్యవధికి తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.50వేలను హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లు, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో మదుపు చేయండి. అయిదేళ్ల పాటు నెలకు రూ.50వేలు మదుపు చేస్తే.. 10 శాతం రాబడి అంచనాతో రూ.36,63,060 జమ అయ్యే అవకాశం ఉంది. మీరు పదవీ విరమణ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని కనీసం 7శాతం రాబడినిచ్చే పథకంలో మదుపు చేస్తే.. నెలకు రూ.21,000 వరకూ ఆదాయం లభిస్తుంది.


* మూడేళ్లలో ఇల్లు కొనాలని అనుకుంటున్నాం. దీనికి మార్జిన్‌ మనీ కోసం నెలకు రూ.15వేల వరకూ జమ చేయాలనుకుంటున్నాం. దీనికోసం వీపీఎఫ్‌ మంచిదేనా? - ప్రశాంతి

మీకు మూడేళ్ల వ్యవధి ఉంది కాబట్టి, మీరు పెట్టే పెట్టుబడులపై నష్టభయం ఉండకుండా చూసుకోవాలి. వీపీఎఫ్‌ మంచి పథకమే. మీరు ఇందులో డబ్బు జమ చేసుకోవచ్చు. మీరు ఇల్లు కొనాలనుకున్న సమయానికి ఈ ఖాతాలో నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు.


* మా అమ్మాయి వయసు 4 ఏళ్లు. తన పేరుమీద ఇప్పటికే సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.3,000 జమ చేస్తున్నాను. మరో రూ.5వేలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా. దీనికోసం ఏ పథకాలను ఎంచుకోవాలి? - దివ్య

పిల్లల చదువులను దృష్టిలో పెట్టుకొని మదుపు చేసేటప్పుడు విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి వచ్చేలా చూసుకోవాలి. దీర్ఘకాలిక దృష్టితో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచవల్‌ ఫండ్లను ఇందుకోసం పరిశీలించవచ్చు. వీటిల్లో కనీసం 11-13 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. మీరు నెలకు రూ.5వేల చొప్పున 15 ఏళ్లపాటు మదుపు చేస్తే సగటున 12 శాతం రాబడి అంచనాతో రూ.22,36,782 అయ్యేందుకు అవకాశం ఉంది.


* ఆరేళ్ల తర్వాత నాకు కనీసం రూ.15 లక్షలు అవసరం. ప్రస్తుతం నా దగ్గర రూ.6 లక్షలు ఉన్నాయి. వీటిని ఎక్కడ మదుపు చేయాలి. నాకు అవసరమైన మొత్తం రావాలంటే నెలకు ఇంకా ఎంత జమ చేయాలి? - రమేశ్‌
మీ దగ్గర ఉన్న రూ.6 లక్షలు ఆరేళ్ల తర్వాత రూ.15లక్షలు కావాలంటే.. కనీసం 16.5 శాతం రాబడి వచ్చేలా మదుపు చేయాలి. కానీ, ఇది అంత తేలిక కాదు. కనీసం 10-12 శాతం రాబడి వచ్చేలా వీటిని మదుపు చేయొచ్చు. నెలకు రూ.5వేల చొప్పున హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేస్తే.. దాదాపు 10శాతం రాబడి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మీరు అనుకున్నట్లు రూ.15 లక్షలు జమ అవుతాయి. అయితే, డబ్బు అవసరమైనప్పుడు రెండేళ్ల ముందుగానే హైబ్రిడ్‌ ఫండ్ల నుంచి లిక్విడ్‌ ఫండ్లలోకి క్రమానుగతంగా పెట్టుబడులను మళ్లించండి.


- తుమ్మ బాల్‌రాజ్‌


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.