
బిజినెస్
కిర్లోస్కర్ కుటుంబ వివాదంలో సుప్రీంకోర్టు
దిల్లీ: కిర్లోస్కర్ ఆస్తులకు సంబంధించి ఏర్పడ్డ కుటుంబ వివాదంలో మధ్యవర్తిత్వం అంశంపై మీ అభిప్రాయమేంటో చెప్పాలంటూ అతుల్ చంద్రకాంత్ కిర్లోస్కర్‌తో పాటు 13 మందిని సుప్రీంకోర్టు కోరింది. ఆస్తుల కేసులో మధ్యవర్తిత్వానికి ఆదేశిస్తూ బాంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ కిర్లోస్కర్ బ్రదర్స్(కేబీఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సంజయ్ కిర్లోస్కర్ దావా వేశారు. దీంతో యథాపూర్వ స్థితిని కొనసాగిస్తూ, మధ్యవర్తిత్వానికి అవకాశం ఉందేమో చూడాలంటూ ఇరు పక్షాలనూ కోరుతూ జులై 27న సుప్రీం కోర్టు ఆదేశించింది. కిర్లోస్కర్ బ్రదర్స్, శ్యామ్ దివాన్ తరఫు సీనియర్ న్యాయవాదులు సమర్పించిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశంలో మీ అభిప్రాయాలు చెప్పాలంటూ అతుల్ చంద్రకాంత్ కిర్లోస్కర్, ఇతరుల తరఫు వాదిస్తున్న న్యాయవాదులను ధర్మాసనం కోరింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్. బొపన్న, జస్టిస్ హిమా కోహ్లి సైతం ఉన్నారు. బాంబే హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన విజ్ఞప్తిపై విచారణ చేపట్టడానికి నవంబరు 12న సుప్రీం అంగీకరించిన విషయం తెలిసిందే.
మరిన్ని
దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే.. ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయంటే?
Gold Bonds: 29 నుంచి మరో విడత గోల్డ్ బాండ్ స్కీమ్.. గ్రాము ధరెంతంటే?
5G Trails: 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్ మరో మైలురాయి.. 4Gbpsతో డేటా బదిలీ!
Tega Industries IPO: డిసెంబరు 1న టెగా ఇండస్ట్రీస్ ఐపీఓ.. ధర ఎంతంటే?
Tata Group: సెమీకండెక్టర్ల పరిశ్రమ ఏర్పాటుపై మూడురాష్ట్రాలతో చర్చలు?