
బిజినెస్
ఇంటర్నెట్‌డెస్క్: చైనాకు చెందిన ప్రముఖ రైడ్ సేవల సంస్థ దీదీని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి విరమించుకోవాలని ఒత్తిడి వస్తోంది. ఈ మేరకు చైనా అధికారులు దీదీ ఎగ్జిక్యూటీవ్లకు సూచించారు. డేటా సెక్యూరిటీలో సమస్యల కారణంగానే వారు ఈ మేరకు సూచించినట్లు సమాచారం. అమెరికాలో ట్రేడింగ్ జరిగితే డేటా అక్కడి అధికారుల చేతిలోకి వెళుతుందని చైనా ఆందోళన చెందుతోంది.
ఈ అంశంపై అటు దీదీ, ది సైబర్‌స్పేస్ అడ్మిన్‌స్ట్రేషన్ ఆఫ్ చైనా స్పందించలేదు. ఈ వార్త బయటకు పొక్కగానే దీదీలో పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, టెన్సెంట్ వాటాలు భారీగా పతనమయ్యాయి. దీదీ షేర్లు 42శాతం పతనమై 8.11 డాలర్లుగా ఉంది. న్యూయార్క్ మార్కెట్ నుంచి వైదొలగాక పూర్తిగా ప్రైవేటీకరణ చేయడంగానీ, లేదా హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజిలో ట్రేడింగ్ నిర్వహించడంగానీ చేయవచ్చు.
వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యత, ప్రచార ప్రయోజనాల పేరుతో క్యాబ్ సర్వీసులు అందించే ‘దీదీ గ్లోబల్ ఐఎన్‌సీ’పై ఆంక్షలు విధించింది. ఇటీవల సైబర్ సెక్యూరిటీ రివ్యూ నేపథ్యంలో నూతన రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం సహా చైనాకు చెందిన అప్లికేషన్ స్టోర్ల నుంచి దీదీ యాప్‌ను తొలగించాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సహా భద్రతా పరమైన సమస్యలను నిరోధించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ఉబెర్, ఓలా తరహాలో చైనాలో క్యాబ్ సర్వీసులు అందించే సంస్థే దీదీ గ్లోబల్ ఐఎన్‌సీ. ఈ రంగంలో ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల్లో ఇదీ ఒకటి. దీదీ సంస్థకు 493 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉండగా.. దీనిలో మూడొంతుల మంది చైనాలోనే ఉన్నారు. బీజింగ్ వేదికగా పనిచేసే ఈ క్యాబ్ సర్వీసు సంస్థ బ్రెజిల్, మెక్సికో సహా 14 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. గతంలో చైనాలో ఉబెర్, దీదీ మధ్య పోటీ నడిచింది. అయితే 2016లో దీదీ గ్లోబల్ చైనాలోని ఉబెర్‌ను కొనుగోలు చేసింది.
మరిన్ని
దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే.. ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయంటే?
Gold Bonds: 29 నుంచి మరో విడత గోల్డ్ బాండ్ స్కీమ్.. గ్రాము ధరెంతంటే?
5G Trails: 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్ మరో మైలురాయి.. 4Gbpsతో డేటా బదిలీ!
Tega Industries IPO: డిసెంబరు 1న టెగా ఇండస్ట్రీస్ ఐపీఓ.. ధర ఎంతంటే?
Tata Group: సెమీకండెక్టర్ల పరిశ్రమ ఏర్పాటుపై మూడురాష్ట్రాలతో చర్చలు?