
బిజినెస్
దిల్లీ: సహజ వ్యక్తిగత సంరక్షణ, ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ ‘మదర్ స్పార్ష్’లో ప్రముఖ వ్యాపార సంస్థ ఐటీసీ 16 శాతం వాటాలను కొనుగోలు చేయనుంది. ఇందుకు షేరు సబ్స్క్రిప్షన్ ఒప్పంద ప్రాతిపదికన ఐటీసీ రూ.20 కోట్లు వెచ్చించనుంది. ఒప్పందం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో వాటాల కొనుగోలు ప్రక్రియ ముగియనుంది. రెండు విడతల్లో లావాదేవీలు జరగనున్నాయి. ఈ ప్రతిపాదనకు కంపెనీ వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉంది.
ముఖ్యంగా తల్లీపిల్లల సంరక్షణ ఉత్పత్తులను విక్రయించే మదర్ స్పార్ష్ ప్రీమియం ఆయుర్వేదిక్, నాచురల్ పర్సనల్ కేర్ ఉత్పత్తులను అందిస్తోంది. ప్రస్తుతానికి నేరుగా వినియోగదారులకే ఉత్పత్తులను విక్రయిస్తోంది. 2016లో మనుగడలోకి వచ్చిన ఈ సంస్థ 2020-21లో రూ.15.44 కోట్ల టర్నోవర్ సాధించింది. ఐటీసీ గత కొన్నేళ్లుగా పోగాకేతర వ్యాపారంపై దృష్టి సారిస్తోంది. 2020లో మసాలాల తయారీ సంస్థ సన్‌రైజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రూ.2,150 కోట్లకు కొనుగోలు చేసింది.
మరిన్ని
దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే.. ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయంటే?
Gold Bonds: 29 నుంచి మరో విడత గోల్డ్ బాండ్ స్కీమ్.. గ్రాము ధరెంతంటే?
5G Trails: 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్ మరో మైలురాయి.. 4Gbpsతో డేటా బదిలీ!
Tega Industries IPO: డిసెంబరు 1న టెగా ఇండస్ట్రీస్ ఐపీఓ.. ధర ఎంతంటే?
Tata Group: సెమీకండెక్టర్ల పరిశ్రమ ఏర్పాటుపై మూడురాష్ట్రాలతో చర్చలు?