
బిజినెస్
దిల్లీ: సెక్యూరిటీల మార్కెట్కు సంబంధించిన ప్రాథమిక అంశాల్లో మదుపర్లకు అవగాహన తెచ్చేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మొబైల్ యాప్ ‘సాRsథీ’ని తీసుకొచ్చింది. మొబైల్ ద్వారా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ యాప్ను విడుదల చేసినట్లు సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగీ వెల్లడించారు. ఇటీవల కాలంలో మార్కెట్లోకి చిన్న మదుపర్ల రాక గణనీయంగా పెరిగిందని, వారికి పనికొచ్చే సమాచారం కొత్త యాప్లో ఉంటుందని తెలిపారు. యువతకు ఈ యాప్ బాగా ఉపయోగపడుతుందన్నారు. సెక్యూరిటీల మార్కెట్, కేవైసీ ప్రక్రియ, ట్రేడింగ్, సెటిల్మెంట్, మ్యూచువల్ ఫండ్లు, ఇటీవల మార్కెట్ పరిణామాలు, మదుపర్ల సమస్యల పరిష్కార విధానం వంటి వివరాలు ఇందులో ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో లభించే ఈ యాప్ను ఆండ్రాయిడ్ ప్లేస్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.