ఎర్రటి కాయకు.. నల్లటి మచ్చలు

అనంతపురం జిల్లా దానిమ్మ రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోతున్నారు. తోటలకు తెగుళ్లు సోకడంతో ఎర్రగా మారాల్సిన కాయ కాస్త నల్ల మచ్చలతో చెట్టు మీదే పగిలిపోతోంది. దిక్కుతోచని రైతులు కాయలను తెంపి, తోటలకు దూరంగా పూడ్చేస్తున్నారు. అనంతపురం గ్రామీణ మండలం చిన్నంపల్లి గ్రామానికి చెందిన ముప్పారపు వెంకట్‌ 12 ఎకరాల్లో దానిమ్మ సాగు చేశారు. గతేడాది 90 టన్నుల దిగుబడి రాగా.. రూ.1.32 కోట్లు సంపాదించారు. ఈ సంవత్సరం కాయ పక్వానికి వచ్చే దశలో తెగులు సోకింది. ఇప్పటి వరకు 30 టన్నుల కాయలను పూడ్చేశారు. దెబ్బతిన్న కాయలను కోయకుంటే తెగులు చెట్లకూ సోకి.. చివరికి తోటంతా ఎండిపోతుందని ముందే తెంపేస్తున్నట్లు రైతులు తెలిపారు. వాతావరణంలో మార్పులు, అధిక తేమ కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

- ఈనాడు, అనంతపురం, న్యూస్‌టుడే, ఆత్మకూరు


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని