రబీకి 23.19 లక్షల టన్నుల ఎరువులు

ఈనాడు, అమరావతి: రాబోయే రబీ పంట కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం 23.19 లక్షల టన్నుల ఎరువుల్ని కేటాయించింది. గతేడాది రబీతో పోలిస్తే 2.55 లక్షల టన్నుల్ని పెంచింది. 9.15 లక్షల టన్నుల యూరియా, 1.95 లక్షల టన్నుల డీఏపీ, 1.68 లక్షల టన్నుల ఎంఓపీ, 9.56 లక్షల టన్నుల మిశ్రమ ఎరువులు, 85వేల టన్నుల ఎస్‌ఎస్‌పీని కేటాయించినట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. గురువారం జరిగిన రాష్ట్రాల వ్యవసాయ కమిషనర్ల సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి ప్రియరంజన్‌, సంయుక్త కార్యదర్శి నీరజ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ కేటాయింపులు చేసినట్లు చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని