దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

ఇండియన్‌ దళిత్‌ క్రిస్టియన్‌ రైట్స్‌

ఈనాడు, దిల్లీ: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే బిల్లును ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఇండియన్‌ దళిత్‌ క్రిస్టియన్‌ రైట్స్‌ జాతీయ అధ్యక్షుడు పెరికె వరప్రసాద్‌రావు డిమాండు చేశారు. క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఇండియన్‌ దళిత్‌ క్రిస్టియన్‌ రైట్స్‌, ఎస్సీ, బీసీ సంఘం ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌లో గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌రావు, ఎస్సీ, బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కలివెల ఎలిషా కుమార్‌ మాట్లాడారు. ఆయా సంఘాలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైకాపా ఎంపీలు మార్గాని భరత్‌, రెడ్డప్పలకు అందజేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని