శ్రీవారి ఆలయంలో 8 నుంచి పవిత్రోత్సవాలు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఆదివారం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా నిర్వహించే అర్చనలు, ఉత్సవాల్లో ఏవైనా దోషాలు జరిగితే వాటి వల్ల ఆలయ పవిత్రతకు లోటు రాకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. 8న పవిత్రాల ప్రతిష్ఠ, 9న పవిత్ర సమర్పణ, 10న పూర్ణాహుతి నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల వల్ల ఆదివారం సహస్ర దీపాలంకార సేవను తితిదే రద్దు చేసింది. ఈ నెల 9న అష్టదళ పాదపద్మారాధనతో పాటు ఈ నెల 8 నుంచి 10వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలనూ రద్దు చేసింది. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం గంట పాటు భారీ వర్షం కురవడంతో శ్రీవారి ఆలయ మాడ వీధులు జలమయం అయ్యాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని