టీడీఎస్‌ చెల్లించినట్లు చలానా ఉంటేనే రిజిస్ట్రేషన్‌

ఈనాడు, అమరావతి: డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌లో పేర్కొన్న మార్కెట్‌ విలువ రూ.50 లక్షలు దాటితే... ఒక శాతం టీడీఎస్‌ కింద చెల్లించినట్లు కొనుగోలుదారుల నుంచి తప్పనిసరిగా చలానా తీసుకోవాలని సబ్‌-రిజిస్ట్రార్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఆదేశించారు. క్రయ, విక్రయదారుల పాన్‌కార్డు నంబర్లను డాక్యుమెంట్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ విధానం ఎప్పటి నుంచో ఉన్నా... సరిగా అమలు కావట్లేదు. ఇటీవల ఆదాయ పన్ను విభాగం నుంచి వచ్చిన సూచనల మేరకు ఐజీ రామకృష్ణ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ భూములు మినహా మిగిలిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. డాక్యుమెంటులో పేర్కొన్న మార్కెట్‌ విలువకు తగ్గట్లు చెల్లింపులు ఎలా జరిగినా (నగదు, చెక్‌/ఆర్‌టీజీఎస్‌) ఆ వివరాలు ఐటీ వారికి వెళ్తాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని