పోలవరం వరద బాధితుల ధర్నా

ఉద్యోగుల నిర్బంధం.. అధికారుల హామీతో విడుదల

కుక్కునూరు, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన కుక్కునూరు మండలం బెస్తగూడెంలో వరద బాధితులు శుక్రవారం ధర్నా చేశారు. 362 ఇళ్లున్న బెస్తగూడెంలో గడ్డిళ్లు, పూరి గుడిసెలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  అధికారులు 79 ఇళ్లే దెబ్బతిన్నట్లు లెక్క రాశారు. అందులో పక్కా ఇళ్లు కూడా ఉన్నాయి. కూలిపోయిన ఇళ్లకు సంబంధించిన బాధితుల పేర్లు సర్వేలో లేవు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు శుక్రవారం గ్రామ సచివాలయ సిబ్బందిని నిర్బంధించారు. వారిని కార్యాలయంలో పెట్టి, బయట తాళం వేశారు. తమకు న్యాయం జరిగే వరకూ వదిలేది లేదంటూ సచివాలయం ఎదుట ధర్నా చేశారు. ఎంపీడీవో శ్రీనివాసు ఆందోళనకారులతో ఫోన్‌లో మాట్లాడి.. జిల్లా కలెక్టర్‌ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని వివరించారు. దీంతో బాధితులు ఆందోళన విరమించి, ఉద్యోగులను విడిచిపెట్టారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని