రుషికొండ పనులను పరిశీలించిన ఏపీటీడీసీ ఎండీ

గోప్యంగా పర్యటన వివరాలు

ఈనాడు, విశాఖపట్నం: రుషికొండ పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఎండీ కన్నబాబు శుక్రవారం పరిశీలించారు. ఇంజినీరింగ్‌, గుత్తేదారు కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పనుల తీరును తనిఖీ చేసినట్లు తెలిసింది. పర్యాటకశాఖ ఎండీగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో కొండ తవ్వకం పనులు, చేపడుతున్న నిర్మాణాలను దగ్గరుండి చూసినట్లు సమాచారం. రుషికొండ చుట్టూ చేపట్టిన తవ్వకాలు, ఎక్కడెక్కడ భవన నిర్మాణాలు జరుగుతాయనేది తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ పనులు చేపడుతున్నారని హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో ప్రస్తుతం కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎండీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన పర్యటన వివరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని