నేడు దిల్లీకి జగన్‌, చంద్రబాబు

నీతిఆయోగ్‌ సమావేశానికి జగన్‌

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కమిటీ భేటీకి చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు శనివారం దిల్లీ వెళ్తున్నారు. వారిద్దరూ అక్కడ జరిగే వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చంద్రబాబు శనివారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌ నుంచి, జగన్‌ సాయంత్రం 5.20కి విశాఖ నుంచి దిల్లీ వెళ్లనున్నారు. జగన్‌ శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరుతారు. 3.40 గంటలకు ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. సాయంత్రం 5.20కి విశాఖ విమానాశ్రయం నుంచి ఆయన దిల్లీ బయలుదేరి వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగే నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం పాల్గొంటారు. సాయంత్రం 5.30కు దిల్లీ నుంచి బయల్దేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ 

తెదేపా అధినేత చంద్రబాబు శనివారం మధ్యాహ్నం 12.25 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జాతీయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. శనివారం రాత్రికి దిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్‌ చేరుకుంటారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని