సమీకృత ర్యాంకుల్లో తెలుగురాష్ట్రాల వెనుకంజ

38వ స్థానంలో తెలంగాణ నార్త్‌ డిస్కం
దక్షిణ డిస్కంకు 45వ స్థానం
50, 51 స్థానాల్లో నిలిచిన ఏపీ ఈస్ట్రన్‌, సదరన్‌ డిస్కంలు

ఈనాడు, దిల్లీ: పదవ ఇంటిగ్రేటెడ్‌ రేటింగ్‌ అండ్‌ ర్యాంకింగ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన డిస్కంలు వెనుకబడ్డాయి.కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ శుక్రవారం రాత్రి వీటిని విడుదల చేశారు. టాప్‌-5లో గుజరాత్‌కు చెందిన నాలుగు విద్యుత్తు సంస్థలు నిలవగా తెలుగురాష్ట్రాల డిస్కంలు సీ మైనస్‌, డీ గ్రేడ్‌లతో 38, 45, 50, 51 స్థానాలకు పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 100 డిస్కంల పనితీరును లెక్కించి అందులో 52 వరకు ర్యాంకులు ఇచ్చారు. మిగతా వాటికి ఇవ్వలేదు. సీ- గ్రేడ్‌తో తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ 38వ ర్యాంకులో, దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ 45వ స్థానంలో నిలిచాయి. డీ గ్రేడ్‌తో ఏపీ తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ 50, దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ 51వ స్థానానికి పరిమితమయ్యాయి. ఏపీ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థకు ర్యాంకు ప్రకటించకపోయినా సీ-గ్రేడ్‌ ఇచ్చారు. ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో విద్యుత్తు డిపార్ట్‌మెంట్లకు 11 ర్యాంకులు ప్రకటించగా అందులో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కలేదు. 2012 నుంచి కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ ర్యాంకులు విడుదల చేస్తూ వస్తోంది. ఆర్థిక సుస్థిరత, అద్భుతమైన పనితీరు, బాహ్య వాతావరణం, ఏటా వచ్చే మార్పులను స్వీకరించే సామర్థ్యం ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు.

కన్సూమర్‌ సర్వీస్‌ రేటింగ్‌లో ఏపీ, తెలంగాణలకు ఏ-గ్రేడ్‌

ఇదే సమయంలో కేంద్రమంత్రి ఆర్‌కే సింగ్‌ 2020-21 సంవత్సరానికి సంబంధించి కన్సూమర్‌ సర్వీస్‌ రేటింగ్‌ ఆఫ్‌ డిస్కమ్స్‌ తొలి నివేదికను విడుదల చేశారు. నిర్వహణ నిలకడ (ఆపరేషనల్‌ రిలయబిలిటీ), కనెక్షన్‌ సర్వీసులు, మీటరింగ్‌, బిల్లింగ్‌, కలెక్షన్‌, తప్పుల దిద్దుబాటు, ఫిర్యాదుల పరిష్కారం ఆధారంగా డిస్కంలకు రేటింగ్‌ ఇచ్చారు. ఇందులో ఏపీ సీపీడీసీఎల్‌, ఏపీ ఎస్‌పీడీసీఎల్‌, టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌లు ఏ గ్రేడ్‌ కైవసం చేసుకున్నాయి. ఏపీ ఈపీడీసీఎల్‌ బీ+ గ్రేడ్‌ దక్కించుకొంది. టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ బి గ్రేడ్‌కు పరిమితమైంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ఠంగా 23.88 గంటలు, పట్టణ ప్రాంతాల్లో 24గంటలు విద్యుత్తు అందుతున్నట్లు నివేదిక పేర్కొంది. సగటున గ్రామీణప్రాంతాల్లో 20.89 గంటలు, పట్టణాల్లో 23.5 గంటలు సరఫరా అవుతున్నట్లు వెల్లడించింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని