అగ్రి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు, న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరానికి అగ్రి డిగ్రీ కోర్సులు ఫుడ్‌ టెక్నాలజీ, బైపీసీ, ఎంపీసీ, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ (ఎంపీసీ రైతు కోటా), కమ్యూనిటీ సైన్స్‌లో ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ జి.రామారావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. angrau.ac.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ నెల 16 లోపు పూర్తిచేసి పంపాలన్నారు. బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సుకు ఇంటర్‌ మార్కులతో ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా కింద దరఖాస్తు చేయడానికి ఈ నెల 25 లోపు వాటిని పంపాలని కోరారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని