ఆహార ఉత్పత్తులపై పాత జీఎస్టీ రేట్లే అమలు చేయాలి

జీఎస్టీ కౌన్సిల్‌ ఛైర్మన్‌కు ఏపీ ఛాంబర్స్‌ లేఖ

ఈనాడు, అమరావతి: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పెంపుతో ఆహార ఉత్పత్తులు, నిత్యావసరాల ధరలు పెరుగుతాయని, దీనివల్ల కొనుగోలు శక్తి తగ్గే ప్రమాదం ఉందని ఏపీ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ (ఏపీ ఛాంబర్స్‌) ఆందోళన వ్యక్తం చేసింది. జీఎస్టీ శ్లాబ్‌ల మార్పుతో సామాన్య ప్రజలపై భారం పడనున్నందున.. పాత శ్లాబ్‌లే అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్‌కు లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ‘47వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ప్యాకేజ్డ్‌ ఫుడ్‌పై జీఎస్టీ పెంపు ప్రతిపాదనతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలకు భారమవుతుంది. ప్యాకింగ్‌ చేసిన పప్పులు, బియ్యం, గోధుమలు, బెల్లం, తేనె, పన్నీరు, పెరుగు, పిండి వంటి నిత్యావసరాలపై కౌన్సిల్‌ కొత్తగా 5 శాతం జీఎస్టీ విధించింది. మామిడి పళ్లతో తయారైన ఉత్పత్తులు, పానీయాలపై 12 శాతం జీఎస్టీని ప్రకటించింది. ప్యాకింగ్‌ చేసిన వస్తువులు, పానీయాలు, డెయిరీ ఉత్పత్తులపై గతంలో ఉన్న జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో వాటి వినియోగం తగ్గే అవకాశం ఉంది. ప్యాకింగ్‌, లేబుల్‌ అతికించిన మాంసం, చేపల వంటి ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ వసూలు చేయాలన్న నిర్ణయం కూడా వినియోగదారులకు భారమే’ అని లేఖలో పేర్కొంది. గణనలోకి తీసుకుని ఆహార ఉత్పత్తులపై పాత విధానంలోనే జీఎస్టీ వసూలు చేయాలని కోరింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని