‘ఎన్ని కుయుక్తులు పన్నినా అమరావతే రాజధాని’

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రాల పరిధిలో రాజధానులు ఏర్పాటు చేసుకునే స్పష్టమైన అధికారం ఆ రాష్ట్ర శాసనసభకు ఉండాలని రాజ్యాంగ సవరణ కోరుతూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టడాన్ని రాజధాని రైతులు ఖండించారు. రాష్ట్ర విభజన అనంతరం చట్టానికి లోబడే అన్ని పార్టీల ఆమోదంతోనే రాజధానిని ఏర్పాటు చేశారన్న  విషయాన్ని గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. ప్రభుత్వం మారిన తరువాత మొండి పట్టుదలతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి జగన్‌ విఫలమయ్యారని విమర్శించారు. రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ మరోసారి అమరావతిపై విషం చిమ్మడానికి వైకాపా సిద్ధమైందని మండిపడ్డారు. అమరావతి విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ అది కుదరదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు శుక్రవారానికి 962వ రోజుకు చేరాయి. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, నెక్కల్లు, కృష్ణాయపాలెం, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని