ఆదర్శ పాఠశాలల్లో ఒప్పంద టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ

ఈనాడు, అమరావతి: ఆదర్శ పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ) పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. టీజీటీ 71, పీజీటీ 211 పోస్టులను ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ నెల 17వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితా 23న, అభ్యంతరాల స్వీకరణ 24-25, ఇంటర్వ్యూ జాబితా 29న విడుదల చేస్తారు. వెబ్‌కౌన్సెలింగ్‌ నవంబరు 8న ఉంటుంది. అభ్యర్థులు ఉద్యోగాల్లో నవంబరు 9న చేరాలి. సాధారణ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్‌ వారికి 49ఏళ్లు. ఎంకాం అప్లైడ్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌ సబ్జెక్టు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీటీకి అనర్హులు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ అధ్యక్షతన ఉండే కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. డిగ్రీ, పీజీకి 60శాతం, బీఈడీకి 10శాతం, గతంలో అతిథి అధ్యాపకులుగా చేసినవారికి 20శాతం, టీచింగ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలకు 10శాతం వెయిటేజీ ఉంటుంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని