ఎంపీ గోరంట్ల మాధవ్‌ క్షమాపణ చెప్పాలి

తెలంగాణ రాష్ట్ర కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య డిమాండ్‌  

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కమ్మ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని కమ్మసంఘం హాల్‌లో సోమవారం సమాఖ్య ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి గంగవరపు శ్రీరామకృష్ణ ప్రసాద్‌, కోశాధికారి కండపనేని రత్నాకర్‌రావు తదితరులు మాట్లాడుతూ... వ్యక్తిగత విషయాలను వ్యక్తుల మధ్య చూసుకోవాలని, సామాజిక వర్గాల్ని దూషించడం, కించపరచడం గౌరవప్రదమైన పార్లమెంట్‌ సభ్యుడి హోదాలో ఉన్న మాధవ్‌కు తగదన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సమాఖ్య ఉపాధ్యక్షులు కలగర శ్రీనివాసరావు, బొడ్డు రవిశంకర్‌రావు, తాళ్లూరి చంద్రమౌళి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


సిగ్గుమాలిన చేష్టలకు పాల్పడి.. కురబ అని చెప్పుకోవడమా?

ఈనాడు, అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించి సమాజం తలదించుకునే వీడియో బయటకు రావటంతో.. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఆయన కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కురబ కార్పొరేషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ సవిత ఆరోపించారు. మాధవ్‌ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు వైకాపా ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని వాటిలో చిక్కి కురబ సోదరులు మోసపోవద్దని పిలుపునిచ్చారు. సోమవారం ఆమె వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘కురబ సామాజికవర్గం నీతి, నిజాయతీ, ధైర్యానికి మారుపేరు. అలాంటి కులంలో పుట్టిన గోరంట్ల మాధవ్‌ వీడియో కాల్‌లో నగ్నంగా ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడి కులానికే కాదు, దేశానికీ చెడ్డపేరు తెచ్చారు’ అని విమర్శించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని