AP ICET: ఏపీ ఐసెట్‌-2022 ఫలితాలు విడుదల

87.83 శాతం అర్హత

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : రాష్ట్రవ్యాప్తంగా ఎం.బి.ఎ, ఎం.సి.ఎ. కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో సోమవారం సాయంత్రం ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో 87.83 శాతం అర్హత సాధించారు. మొదటి పది ర్యాంకుల్లో యువకులు ఏడు ర్యాంకులు, యువతులు మూడు ర్యాంకులు సాధించారు. తిరుపతికి చెందిన రెడ్డప్పగారి ఖేతన్‌ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు, గుంటూరుకు చెందిన డి.పూజిత వర్థన్‌ రెండో ర్యాంకు, శ్రీకాకుళానికి చెందిన ఎన్‌.వంశీ భరద్వాజ్‌ మూడో  ర్యాంకు సాధించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబు, సహ కన్వీనర్‌ ఆచార్య భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని