పస్తులుంటున్నాం.. పట్టించుకునే వారే లేరు

వరద బాధితుల నిరసన

ఎటపాక, న్యూస్‌టుడే: ‘రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు మావి. గోదావరి వరదల కారణంగా ఇరవై రోజులుగా పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యాం. గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో బయటకు వెళ్లేందుకు వీలులేక కొన్ని రోజులు పస్తులున్నాం. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహాయం అందడం లేదు’ అంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గుండాల పంచాయతీలోని గుండాలకాలనీ వాసులు సోమవారం గ్రామ సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమకు నిత్యావసరాలు, బియ్యం, నగదు రూ.2000 సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని