డివిజన్‌ మొత్తం విద్యుదీకరణ

ద.మ. రైల్వేలో గుంతకల్లు ఘనత

ఈనాడు-అమరావతి: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మొత్తం అన్ని లైన్ల విద్యుదీకరణ పూర్తిచేసుకున్న ఘనతను గుంతకల్లు డివిజన్‌ సాధించింది. ధర్మవరం-పాకాల సెక్షన్‌లోని తుమ్మనంగుట్ట-కలికిరి మధ్య 50 కి.మీ. విద్యుదీకరణ పనులు పూర్తికావడంతో.. డివిజన్‌ మొత్తం పూర్తయినట్లయింది. ధర్మవరం-పాకాల సెక్షన్‌లో 228 కి.మీ. విద్యుదీకరణ పనులు 2017-18లో మంజూరయ్యాయి. రూ.253 కోట్లతో వీటిని చేపట్టారు. ఇందులో ధర్మవరం-కదిరి మధ్య 68 కి.మీ. పనులు గత ఏడాది మార్చికి పూర్తయ్యాయి. కదిరి-తుమ్మనంగుట్ట మధ్య 54 కి.మీ., కలికిరి-పాకాల మధ్య 56 కి.మీ. విద్యుదీకరణ ఈ ఏడాది మార్చికి పూర్తిచేశారు. మిగిలిన తుమ్మనంగుట్ట-కలికిరి మధ్య 50 కి.మీ. తాజాగా పూర్తిచేశారు. దీంతో ధర్మవరం-పాకాల సెక్షన్‌ మొత్తం విద్యుదీకరణ పనులు ముగిశాయి. ఆ సెక్షన్‌లో రైళ్ల సగటు వేగం పెరగనుంది. ప్రయాణ సమయం తగ్గనుంది. ఈ సెక్షన్‌ విద్యుదీకరణ పూర్తికావడంపై దక్షిణ మధ్య రైల్వే ఇన్‌ఛార్జ్‌ జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అధికారులను అభినందించారు. వచ్చే ఏడాది చివరి నాటికి జోన్‌ అంతా విద్యుదీకరణ పూర్తి చేసేలా చూడాలని సూచించినట్లు అధికారులు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts