Andhra news: బీమా పరిహారం చెల్లింపులో జాప్యం లేకుండా నిబంధనలు

వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాలో ఎలాంటి మార్పు లేకుండా.. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకం(పీఎంఎఫ్‌బీవై)తో అనుసంధానించామని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా అమలు చేస్తున్న ఈ-పంట నమోదుపై కేంద్ర అధికారుల బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని, దాని ఆధారంగానే పీఎంఎఫ్‌బీవై అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని వివరించారు. ‘బీమా బరువైందా?’ శీర్షికన మంగళవారం ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో వచ్చిన కథనంపై వ్యవసాయ శాఖ వివరణ ఇచ్చింది. ‘బీమా పరిహారం చెల్లింపులో ఆలస్యం చేయడానికి వీలు లేకుండా.. విధి విధానాలను రూపొందిస్తున్నాం. తర్వాత సీజన్‌ ప్రారంభానికి ముందే పరిహారం చెల్లించేలా నిబంధనలను రూపొందించి అమలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకే.. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని.. పీఎంఎఫ్‌బీవైతో ఉచిత పంటల బీమా పథకాన్ని అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్రమే పూర్తిగా చెల్లిస్తుంది. ఈ-పంట, ఈ-కేవైసీ ద్వారా రైతులు తమ పంటను బీమా చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించి.. 2022-23లో అమలు చేసేలా బీమా సంస్థల ఎంపికకు త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తాం’ అని తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని