ఉమామహేశ్వరి దశదిన కర్మ సందర్భంగా అన్న క్యాంటీన్లలో అన్నదానం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్టీఆర్‌ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి దశదిన కర్మ సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచన మేరకు తెదేపా శ్రేణులు రాష్ట్రంలోని 14 అన్న క్యాంటీన్లలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించాయి. ఉమామహేశ్వరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సుమారు పది వేల మంది ఈ అన్నదానంలో పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని