గ్రంథాలయ, ఎయిడెడ్‌ సిబ్బంది పదవీవిరమణ వయసు 62ఏళ్లు

ఈనాడు, అమరావతి: జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, ఎయిడెడ్‌ సిబ్బంది పదవీవిరమణ వయసును 62ఏళ్లకు పెంచే దస్త్రానికి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారని ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకటరామిరెడ్డి, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.మధుసూదనరాజు తెలిపారు. ఈ ప్రతిపాదనను కేబినెట్‌ ముందు ఉంచాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. కేబినెట్‌ ఆమోదం అనంతరం చట్ట సవరణ చేసి ఉత్తర్వులు అమలు చేస్తారు. ప్రభుత్వం జనవరి నుంచి ఉద్యోగులకు పదవీవిరమణ వయసును 60 నుంచి 62ఏళ్లకు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తమకూ పదవీవిరమణను 62 సంవత్సరాలకు పెంచాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, ఎయిడెడ్‌ సిబ్బంది, విశ్వవిద్యాలయాలు, సొసైటీలు, కార్పొరేషన్‌ల ఉద్యోగులు గత కొంతకాలంగా కోరుతున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని