పాఠశాలల విలీనం నిలిపివేయాలని కలెక్టరేట్‌ల వద్ద పికెటింగ్‌

నిర్బంధాలు విధించినా పాల్గొన్న ఉపాధ్యాయులు

ఈనాడు, అమరావతి: పాఠశాలల విలీన ప్రక్రియను నిలిపివేయాలని, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వుల రద్దు, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్‌) గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట పికెటింగ్‌ నిర్వహించింది. ప్రభుత్వం నిర్బంధం విధించినా పోలీసులను ఎదిరించి ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగించారు. ఒంగోలు జిల్లా కలెక్టరేట్‌ వద్ద జరిగిన పికెటింగ్‌లో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన కార్యదర్శి భానుమూర్తి, విజయవాడలో పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, ప్రభుత్వం మాట తప్పింది. 3,4,5 తరగతుల విలీనం కారణంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు’ అని మండిపడ్డారు. ఈ నెల 16 నుంచి విజయవాడలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని