13న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

ఈనాడు, అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత 24 గంటల్లో ఇది బలపడుతూ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా సూచించారు. దిగువ ట్రోపో ఆవరణలో పశ్చిమ, నైరుతి గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌, యానాంపై ప్రబలంగా ఉంది. దీంతో కోస్తా, రాయలసీమల్లో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. శనివారం కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని