ఉదారంగా స్పందించండి

కేంద్ర బృంద సభ్యులతో విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌

ఈనాడు, అమరావతి: గోదావరి వరద నష్టానికి సాయం విషయంలో ఉదారంగా స్పందించాలని రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 2రోజులుగా పర్యటించిన కేంద్ర బృందాలు గురువారం విజయవాడలోని ఒక హోటల్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్‌తోపాటు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ వారికి వరద నష్టం, ప్రభుత్వ సహాయ చర్యలను వివరించారు. వరద ఉద్ధృతిపై కలెక్టర్లకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చామని, సహాయ బృందాలను తరలించామని తెలిపారు. బృందాలు చేరలేని ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలకు హెలికాప్టర్ల ద్వారా 6రోజుల పాటు ఆహారం, నిత్యావసరాలు అందించామన్నారు. వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామని, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు ఎక్కువ నష్టం జరిగిందని కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన హోమంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు రవినేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. కమిటీ నివేదికను కేంద్రానికి వీలైనంత త్వరగా అందిస్తామని వివరించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని