నేడు ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర వేడుకలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం నిర్వహించే స్వాతంత్య్ర దిన వేడుకలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వేడుకల ట్రయల్‌రన్‌ను ఆదివారం డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటా, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, ఇతర అధికారులు పర్యవేక్షించారు. అదనపు డీజీ (లా అండ్‌ ఆర్డర్‌) రవిశంకర్‌ అయ్యన్నార్‌ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరులో చంద్రబాబు
గుంటూరు(జిల్లా పరిషత్తు), న్యూస్‌టుడే: గుంటూరులో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొననున్నారని గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. గుజ్జనగుండ్ల కూడలిలోని చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్‌లో 9.15 గంటలకు జాతీయ జెండా ఎగరవేస్తారని ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు.


వేడుకలకు వర్షం సవాలు!

రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర సంబరాలకు సిద్ధం చేసిన విజయవాడలోని ఐజీఎంసీ మైదానం ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో తడిసిపోయింది. వర్షం వచ్చే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు కవాతు జరిగే ప్రధాన ట్రాక్‌పై పట్టాలు కప్పారు. కానీ, పట్టాలు లేని భాగంలో కొంత బురదమయంగా మారింది. నీరు నిలిచిన చోట రాత్రి కార్మికులతో మట్టి చల్లించారు.

- ఈనాడు, అమరావతి


పండగ శోభ

స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని రాష్ట్రస్థాయి కార్యాలయాలన్నీ ముస్తాబయ్యాయి. సెక్రటేరియట్‌, సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్‌ ఇతర శాఖాధిపతుల కార్యాలయాలు విద్యుత్తు దీపాల వెలుగుల్లో వెలిగిపోతున్నాయి. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్న భవనాలు.. మూడు రంగుల కాంతుల్లో కనువిందు చేస్తున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts